నరసన్నపేట మండలం గొట్టిపల్లి వద్ద కొలువై ఉన్న శ్రీ హలాలేశ్వర స్వామి ఆలయానికి బుధవారం కార్తీక మాసం పౌర్ణమి, కేదారేశ్వరుని పూజల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుండే కార్తీక దీపోత్సవం అనంతరం స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అర్చకులు స్వామివారిని అందంగా అలంకరించారు.