నరసన్నపేట: శిథిలభవనాలు.. పరాయి పంచన సేవలు.. అంగన్వాడీల దుస్థితి

3చూసినవారు
నరసన్నపేట మండలంలో 115 అంగన్వాడీ కేంద్రాలకు గాను 98 కేంద్రాలకు భవనాలున్నాయి. వీటిలో పదికి పైగా శిథిలావస్థకు చేరుకున్నాయి. మరో 17 కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. భవానిపురం అంగన్వాడీ కేంద్రం పూర్తిగా శిథిలమవడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో పిల్లలకు సరైన సేవలు అందించడం కష్టతరంగా మారింది.