నరసన్నపేట మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణ, బాలాజీ రైస్ మిల్లులను జిల్లా వ్యవసాయ శాఖ జెడి త్రినాధ స్వామి, ఎఫ్సీఐ మేనేజర్ అనుదీప్ నాయుడు మంగళవారం సాయంత్రం పరిశీలించారు. తేమ శాతం లెక్కింపును తనిఖీ చేసి, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో సైంటిస్ట్ మధు కుమార్, వ్యవసాయ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు.