నరసన్నపేట: రైతులకు ఇబ్బందులు కలిగించవద్దు.. కలెక్టర్

834చూసినవారు
రైతులకు ఇబ్బందులు లేకుండా డీజిల్ సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం నరసన్నపేటలోని రెండు పెట్రోల్ బంకులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, పెట్రోల్, డీజిల్ అమ్మకాల వివరాలను బంక్ యజమానులను అడిగి తెలుసుకున్నారు. రైతులు కోరిన మేరకు వారికి డీజిల్ అందించాలని, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. ఈ తనిఖీలో డీఎస్ఓ సూర్య ప్రకాష్, తహసిల్దార్ సత్యనారాయణ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్