నరసన్నపేట: స్విమ్మింగ్ పోటీలో ప్రథమ స్థానంలో నిలిచిన డీటీ

3చూసినవారు
నరసన్నపేట: స్విమ్మింగ్ పోటీలో ప్రథమ స్థానంలో నిలిచిన డీటీ
శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన స్పోర్ట్స్ మీట్ లో నరసన్నపేట డిప్యూటీ తాసిల్దార్ పొదిలాపు శ్రీనివాసరావు స్విమ్మింగ్ పోటీలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆయనను అభినందించారు. ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఈ విజయం సాధించగా, సోమవారం ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు. ద్వితీయ స్థానంలో నరసన్నపేట విఆర్ఓ జె శ్రీనివాస్ నిలిచారు.

ట్యాగ్స్ :