నరసన్నపేట పట్టణంలోని నేతాజీ వీధిలో ఒక విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా వాలిపోయి ఉంది. ఈ ప్రాంతంలో అనేక గృహాలు, దుకాణాలు, ప్రైవేట్ ఆసుపత్రులు, బ్యాంకులు ఉండటంతో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంది. ఈ స్తంభంపై నెట్, కేబుల్ వైర్లు కూడా వెళుతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే పెను విపత్తు సంభవించవచ్చని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.