నరసన్నపేట మండలం పారసిల్లి పంచాయతీలో బుధవారం మాజీ సర్పంచ్ డబ్బేరు కిరణ్ చంద్ర పట్నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. పాలకవర్గం పాలన ముగిసిన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. శిబిరంలో 212 మందికి ఉచిత వైద్యం, మందులు అందించారు. 21 మంది రోగులను ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేశారు.