నరసన్నపేట: బోర్ వెల్ దుకాణంలో చెలరేగిన మంటలు

1చూసినవారు
నరసన్నపేట మండలం కంబకాయ జంక్షన్ ఫ్లైఓవర్ వంతెన వద్ద ఉన్న ఒక బోర్వెల్ దుకాణంలో బుధవారం రాత్రి గ్యాస్ లీక్ అవడంతో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన దుకాణం సిబ్బంది, స్థానికుల సహాయంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో కొంతమేర ఆస్తి నష్టం జరిగినట్లు బోర్వెల్ యజమాని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్