నరసన్నపేట: పంట పొలాలకు నిప్పు.. భూసారానికి ముప్పు

2చూసినవారు
నరసన్నపేటలో పంటలు పడిన తర్వాత పొలాల్లో నిప్పు పెట్టడం వల్ల భూసారానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని వ్యవసాయ శాఖ అధికారిని వై సూర్యకుమారి తెలిపారు. ఇలా చేయడం వల్ల పొలంలోని నత్రజని, సల్ఫర్ వంటి ముఖ్యమైన పోషకాలు అంతరించిపోతాయని, మిత్ర కీటకాలు, తేమ, సేంద్రీయ పదార్థం కూడా నశించిపోతాయని ఆమె వివరించారు. ఇది భూసారానికి ఎంతో ముప్పు అని హెచ్చరించారు.

ట్యాగ్స్ :