నరసన్నపేట: పంచాయితీ కార్యాలయానికి చేరిన ప్రభుత్వ పాఠశాల

2చూసినవారు
నరసన్నపేట మండలం కొత్త పోలవలస ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. దీనితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా భయం నడుమ పాఠశాలను నడుపుతున్నామని ఉపాధ్యాయులు తెలిపారు. శుక్రవారం, స్థానిక సర్పంచ్ పట్ట ప్రభాకర్ రావు చొరవ తీసుకుని పాఠశాలను పంచాయతీ కార్యాలయానికి తరలించారు. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :