నరసన్నపేట: నీటి భద్రత కార్యక్రమాల్లో పనులను గుర్తించండి

1చూసినవారు
నరసన్నపేట: నీటి భద్రత కార్యక్రమాల్లో పనులను గుర్తించండి
ప్రభుత్వ ఆదేశాల మేరకు నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో భాగంగా పనులను త్వరితగతిన గుర్తించాలని ఎంపీడీవో కే వి ప్రసాద్ రావు తెలిపారు. బుధవారం సాయంత్రం నరసన్నపేట ఎంపీడీవో కార్యాలయంలో సాగునీటి సంఘాలు, ఇంజనీరింగ్ సహాయకులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో 100 రోజుల ప్రణాళికలో 50 చెరువులలో పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వంశధార, ఉపాధి హామీ అధికారులు పాల్గొన్నారు.