నరసన్నపేట మండల కేంద్రంలో జాతీయ రహదారిపై పశువులతో అక్రమంగా రవాణా అవుతున్న రెండు బొలేరో వాహనాలను పోలీసులు సోమవారం తెల్లవారుజామున అడ్డుకున్నారు. ఒక వాహనంలో 8, మరో వాహనంలో 4 పశువులను గుర్తించారు. పశువులను గోశాలలకు తరలించినట్లు ఎస్సై బి.గణేష్ తెలిపారు. వాహనాలను స్వాధీనం చేసుకుని, అక్రమ రవాణాపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అక్రమ రవాణాను అడ్డుకుంటామని హెచ్చరించారు.