నరసన్నపేట మండలం పోతయ్య వలస పంచాయతీలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులు జరుగుతున్నాయని వైసిపి రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి కణపల అరవింద్ తెలిపారు. గురువారం పంచాయతీలో సుమారు 10 విద్యుత్ స్తంభాలు, వీధిలైట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ పనులకు పంచాయతీ నిధులు వినియోగిస్తున్నామని, గ్రామస్తుల ఇబ్బందులు తొలగించేందుకు కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.