నరసన్నపేట మండలం సత్యవరం గ్రామం వద్ద ఉన్న సూరపు వాని చెరువులో బుధవారం తెల్లవారుజామున కార్తీక దీపోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక మహిళలు తెల్లవారుజామున మూడు గంటలకు చెరువులో కార్తీక దీపాలను విడిచిపెట్టారు. నరసన్నపేట పట్టణంలో చెరువులు కరువవ్వడంతో, భక్తులు దూరంగా ఉన్న సత్యవరం గ్రామం వద్దకు వెళ్లి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ కనుల పండుగ కార్యక్రమాన్ని భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.