రబీ సీజన్లో పండించిన మొక్కజొన్నకు మద్దతు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత మంగళవారం కురిసిన భారీ వర్షానికి పంట తడిసి ముద్దయింది. పోలాకి మండలం తలసముద్రం, మబగాం గ్రామాల్లోని రైతులు ఈ ఏడాది ధర లేక, ప్రకృతి వైపరీత్యంతో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమపై కనికరం చూపడం లేదని వారు పేర్కొన్నారు.