నరసన్నపేట ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో కె.వి. ప్రసాద్ రావు మాట్లాడుతూ, విద్యార్థులకు ఆధార్‌లో మార్పులు, చేర్పులు చేసేందుకు ఆరు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రాలు ఈ నెల 6వ తేదీ వరకు పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. నారాయణ స్కూల్, సెయింట్ క్లారిటీ స్కూల్, విజ్ఞాన్ విద్యానికేతన్, శ్రీ జ్ఞాన జ్యోతి స్కూల్, రవీంద్ర భారతి, జె.వై. స్కూల్, ప్రతిభ స్కూల్ వంటి విద్యాసంస్థలలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన వివరించారు.