నరసన్నపేట మండలం ఉప్పరిపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ఎంఈఓ 2 పేడాడ దాలినాయుడు మంగళవారం ఉదయం పరిశీలించారు. ఆయన విద్యార్థులతో మమేకమై, హోంవర్క్ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల్లోనూ వర్క్ బుక్కులు నిర్వహించాలని, మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని, విద్యార్థుల హాజరు శత శాతం ఉండేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు.