నరసన్నపేట మండలంలోని దేశవానిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం ఎంఈఓ ఉప్పాడ శాంతారావు ఆకస్మికంగా సందర్శించారు. ఆయన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, వంట ఏజెన్సీ సభ్యులకు మెనూ ప్రకారమే భోజనం అందించాలని, పరిశుభ్రత పాటించాలని, స్వచ్ఛమైన తాగునీటిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.