నరసన్నపేట మండలం దూకులపాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఎంఈఓ 1 ఉప్పాడ శాంతారావు ఉపాధ్యాయుని అవతారంలో విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఆయన విద్యార్థులతో మమేకమై, బ్లాక్ బోర్డుపై అక్షరాలను చదివిస్తూ బోధన చేపట్టారు. విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో బోధన కొనసాగించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు.