నరసన్నపేట మండలం రావుల వలస గ్రామానికి చెందిన పైల సుందర్రావు ఇటీవల విడుదలైన గ్రూప్ వన్ ఫలితాలలో డిఎస్పీగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి విజయవాడలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడును కలుసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ ఒక నిరుపేద కుటుంబం నుండి డిఎస్పీగా ఎంపిక కావడం ఆనందదాయకమని పేర్కొన్నారు. మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని సూచించారు.