నరసన్నపేట మండలం బొరిగివలస మార్గంలో సంతోషిమాత ఆలయం వద్ద వీరన్నాయుడు కాలనీలో ఆదివారం ఒక బాలుడు కనిపించాడు. ఈ బాలుడు మాటలు కూడా మాట్లాడలేకపోతున్నాడు. తాను ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదని, స్థానిక భాగ్యలక్ష్మి అప్పడాల కంపెనీ వద్ద అతన్ని ఉంచారని సమాచారం. బాలుడిని గుర్తించినవారు 8978794348 నంబర్‌కు ఫోన్ చేయాలని స్థానికులు కోరుతున్నారు.