నరసన్నపేట: కోదండరామ ఆలయ ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే

1019చూసినవారు
నరసన్నపేట మండలం యారబాడు ఐ కాలనీలో శ్రీ కోదండరామ ఆలయ ప్రతిష్ట మహోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామ గ్రామాన కోదండ రామ ఆలయాలు ఏర్పాటు చేయడం ఆధ్యాత్మికంగా ఎంతో మంచిదని ఆయన పేర్కొన్నారు. ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్