నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక సంతోషిమాత భవన కార్మికుల కార్యాలయంలో శుక్రవారం మే డే సందర్భంగా మహాత్మా గాంధీజీ విగ్రహాన్ని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్మికులంతా ఐక్యతతో మెలగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన, కార్మికులు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు.