నరసన్నపేట: సర్పంచులకు ఘనంగా సత్కరించిన ఎంపీపీ మురళీధర్

2చూసినవారు
నరసన్నపేట మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో సర్పంచ్లకు ఘనంగా సత్కరించామని ఎంపీపీ ఆరంగి మురళీధర్ తెలిపారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా సర్పంచ్ గా విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందించడం పట్ల ఆయన అభినందనలు తెలియజేశారు. గత ప్రభుత్వం నేటి ప్రభుత్వంలో కూడా ప్రజలకు సేవలు అందించారని కొనియాడారు. అనంతరం సర్పంచ్లను ఘనంగా సత్కరించారు.

ట్యాగ్స్ :