నరసన్నపేట మండలం పారసెల్లి గ్రామంలో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం ఉత్సవం ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం, ఈనెల 26 నుండి 28వ తేదీ వరకు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నారు.