పర్యావరణం కలుషితమవుతున్న నేపథ్యంలో మొక్కలు ఎక్కువగా నాటి సమతుల్యతను పాటించాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెద్దాడ లత పేర్కొన్నారు. గురువారం నరసన్నపేట మండల కేంద్రంలోని కళాశాలలో హరిత ధార కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి పలు పండ్లు, పూల మొక్కలతో పాటు ఉద్యానవన పంటలకు సంబంధించిన మొక్కలను నాటించారు.