నరసన్నపేట మండలం ఉర్లాం సబ్స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ బి రామ్ చరణ్ గుప్తా తెలిపారు. బుధవారం ఉర్లాం పరిధిలోని పలు గ్రామాలలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, సంబంధిత గ్రామాల వినియోగదారులు, దుకాణ యజమానులు సహకరించాలని ఆయన కోరారు.