సోమవారం నరసన్నపేట మెజిస్ట్రేట్ కార్యాలయంలో జూనియర్ సివిల్ జడ్జి ఎస్ వాణి ప్యానల్ అడ్వకేట్లతో సమావేశమయ్యారు. నిరుపేదలకు, ముఖ్యంగా మహిళలకు ఉచిత న్యాయ సహాయం అందించాలని ఆమె సూచించారు. న్యాయవాదులను ఏర్పాటు చేసుకోలేని ముద్దాయిలకు న్యాయం చేయాలని, మహిళల కేసులను ఉచితంగా స్వీకరించి వారికి న్యాయం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. న్యాయం అందక ఎంతోమంది జైళ్లలో మగ్గిపోతున్నారని, వారిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.