ఖరీఫ్ తర్వాత రబీ పంటలో భాగంగా ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ అధికారి ఏ సూర్యకుమారి రైతులకు సూచించారు. బుధవారం నరసన్నపేట మండలం కోమర్తి రైతు సేవా కేంద్రం ఆధ్వర్యంలో 'పొలం పిలుస్తుంది' కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రానున్న కాలంలో సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని ఆమె రైతులకు పిలుపునిచ్చారు.