నరసన్నపేట: బాలింతలు, గర్భిణీల వివరాలను ఆన్లైన్లో నమోదుచేయండి

9చూసినవారు
నరసన్నపేట మండలం మాకివలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం సెక్టర్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైద్యాధికారులు విజయకుమార్, ప్రత్యూష మాట్లాడుతూ బాలింతలు, గర్భిణీల వివరాలను తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. వారికి అందుతున్న వైద్య సహాయం, నిర్వహిస్తున్న పరీక్షల వివరాలను కూడా నమోదు చేయాలని ఏఎన్ఎంలు, హెల్త్ సూపర్వైజర్లకు తెలిపారు. ఈ సమావేశంలో సూపర్వైజర్లు పాల్గొన్నారు.