నరసన్నపేట నియోజకవర్గంలో సాగునీటి సంఘాలు, పలు కాలువల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును కోరారు. బుధవారం తాడేపల్లిలో మంత్రికి వినతి పత్రం సమర్పించారు. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి నిధులు విడుదల చేస్తే సాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవచ్చని ఎమ్మెల్యే తెలిపారు.