నరసన్నపేట పట్టణంలో ప్రధాన రహదారికి ఆనుకుని నిర్మించిన ఇండోర్ స్టేడియంను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వైఎంసిఏ జిల్లా కార్యదర్శి, మాజీ సర్పంచ్ గొద్దు చిట్టిబాబు కోరారు. శుక్రవారం ఆయన పోలాకి మండలం మబగాం లో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిని కలిసి వినతి పత్రం సమర్పించారు. కూటమి ప్రభుత్వం పనులు పూర్తి చేసిందని, అయితే ఇంకా పెండింగ్ పనులు ఉన్నాయని, వాటిని పూర్తి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.