నరసన్నపేట మేజర్ పంచాయతీ పరిధిలోని మారుతీ నగర్ నాలుగు, 5 వీధులలో మురుగు కాలువల నిర్మాణం కోసం ఇంటి యజమానులు రహదారిని ధ్వంసం చేశారు. పంచాయతీ అనుమతి లేకుండానే రోడ్లు పాడు చేయడంతో గత మూడు రోజులుగా ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.