జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో అల్లు రోహిత్ అద్భుత ప్రతిభ కనబరిచాడు. గత నెల 17న జరిగిన పరీక్షల్లో ఆల్
ఇండియా ఓపెన్ కేటగిరిలో 102, ఓబీసీ కేటగిరిలో 14వ ర్యాంకు సాధించాడు. సోమవారం ఉదయం విడుదలైన ఈ ఫలితాలను అతని తల్లిదండ్రులు అల్లు షణ్ముఖరావు, లలితాంబ తెలిపారు. ఇటీవల జరిగిన ఐఐటీ జేఈఈలో కూడా జాతీయస్థాయిలో 444 ర్యాంక్ సాధించి పలువురి ప్రశంసలు అందుకున్నాడు.