శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట నియోజకవర్గం నుండి ఇచ్చాపురం వరకు ఉన్న కోస్తా కారిడార్‌లో పర్యాటకాన్ని విస్తరించాలని రాష్ట్ర కాళింగ సంక్షేమ కార్పొరేషన్ అధ్యక్షుడు రోణంకి కృష్ణం నాయుడు కోరారు. గురువారం ఢిల్లీలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును ఆయన కలిసి వినతి సమర్పించారు. పర్యాటక రంగంలో స్థానిక యువతకు ప్రాధాన్యత కల్పించి, వారికి చేయూత అందించాలని ఆయన సూచించారు. దీనిపై మంత్రి స్పందించారు.