నరసన్నపేటలో కలెక్టర్ ఆదేశాల మేరకు రెండవ రోజు పారిశుధ్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గురువారం పప్పుల వీధి వద్ద పేరుకుపోయిన వ్యర్ధాలను తొలగించేందుకు వ్యవసాయ శాఖ ఏడి వెంకట మధు, లావేరు ఎంపీడీవో వెంకటరాజు టీం సభ్యులు ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. వ్యర్థాలు ఎక్కువగా ఉండటంతో జేసీబీని వినియోగిస్తున్నారు. వ్యర్థాలను తొలగించడంలో స్థానికులు సహకరించాలని, లేనిపక్షంలో వ్యర్థాలు వేసే వారిపై పెనాల్టీలు విధిస్తామని అధికారులు తెలిపారు.