నరసన్నపేట మండల కేంద్రంలోని సూరజ్ నగర్ కు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు చందు కుమార్తె బంకుపల్లి సంజన ఖతార్ దేశంలో చిక్కుకుంది. దోహా ఎయిర్ వేస్ లో పనిచేస్తున్న సంజన, ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసి స్వదేశానికి రావడానికి సిద్ధమైంది. అయితే, యుద్ధం ప్రారంభం కావడంతో ఆమె దిక్కుతోచని స్థితిలో చిక్కుకుంది. ఈ విషయాన్ని ఆమె సోమవారం తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు ఆందోళన చెందుతున్నారు.