నరసన్నపేట మండలం సత్యవరం జడ్పీ పాఠశాల విద్యార్థులు కర్నూలులో జరిగిన గట్క పోటీలలో గోల్డ్ మెడల్స్ సాధించారు. స్కూల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గత నెల 29, 30 తేదీలలో జరిగిన ఈ పోటీలలో రాఘవేంద్ర, మణికంఠ, జానకిరామ్, చైతన్య చరణ్, శరత్ కుమార్, దర్శిని, జ్యోతి, నందిని గోల్డ్ మెడల్స్ సాధించినట్లు పిడి జ్యోతి రాణి సోమవారం తెలిపారు. విద్యార్థులను ఆమె అభినందించారు.