నరసన్నపేట: కూలి బిడ్డ శ్వేతకు 990 మార్కులు

73చూసినవారు
నరసన్నపేట: కూలి బిడ్డ శ్వేతకు 990 మార్కులు
ఒక కూలి బిడ్డకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో 990 మార్కులు సాధించింది. నరసన్నపేటలో ఉన్న శ్రీ విజయం జూనియర్ కళాశాలలో చదువుతున్న శ్వేత శనివారం విడుదలైన ఇంటర్ ఫలితాలలో 990 మార్కులు సాధించి జిల్లాలో ప్రథమ స్థానం సాధించింది. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ బి పుష్ప తోపాటు స్థానిక అధ్యాపకులు ఆమెను శనివారం ఘనంగా సత్కరించారు. ఆమెతోపాటు పలువురికి కూడా అత్యధిక మార్కులు రావడంతో అభినందించారు.

సంబంధిత పోస్ట్