నరసన్నపేట మండలం దేవాదిలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్ల కోసం ఉపాధ్యాయులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఆదివారం చేపట్టిన ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ మండల కార్యదర్శి జగదీశ్వర్ రావు ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. యుటిఎఫ్ పిలుపుమేరకు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే లక్ష్యంతో, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను నేరుగా సంప్రదించి, వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాల్సిందిగా కోరుతున్నారు.