నరసన్నపేట: హోలీ పండుగలో సందడి చేసిన క్రీడాకారులు

3చూసినవారు
నరసన్నపేట జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో మంగళవారం ఉదయం హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక మైదానంలో క్రికెట్ క్రీడాకారులతో పాటు పలువురు క్రీడాకారులు రంగులు పూసుకుంటూ సందడిగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. ఫల్గుణ మాసం పౌర్ణమి సందర్భంగా హోలీ రావడంతో కొన్ని ప్రాంతాలలో చిన్నారులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే, పెద్దలు రంగులతో ఆడుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు.