నరసన్నపేటలో కొత్తగా స్పౌజ్ పెన్షన్లు మంజూరు అయ్యాయని ఎంపీడీవో కె. వి ప్రసాద్ రావు తెలిపారు. గత నెలలో మృతి చెందిన 17 మంది వృద్ధుల స్థానంలో వారి భార్యలకు పెన్షన్లు మంజూరు చేసి, బుధవారం పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గొద్దు చిట్టిబాబు, పిఎసిఎస్ డైరెక్టర్ సరిపెల్లి మధు, మాజీ ఎంపీటీసీ పీస కృష్ణ చేతుల మీదుగా పెన్షన్లు అందజేశారు.