నరసన్నపేట మండలం పెద్దపేటలోని శ్రీ శక్తి ఆంజనేయస్వామి ఆలయంలో బుధవారం భక్తిశ్రద్ధలతో శ్రీ హనుమ వ్రతాలను నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు, వారి కుటుంబ సభ్యులు, స్థానిక భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వనమాలి శివశంకర వరప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ వ్రతాలు, ఆలయ అభివృద్ధి పనులలో భాగంగా చేపట్టబడ్డాయి.