నరసన్నపేట మండల కేంద్రంలోని జమ్ము జంక్షన్ వద్ద బుధవారం సాయంత్రం స్టాపర్స్ను ఏర్పాటు చేసినట్లు ఎస్సై బి. గణేష్ తెలిపారు. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో పలు ప్రమాదాలు జరుగుతున్నందున, వాటి నివారణకు ఈ చర్య చేపట్టినట్లు ఆయన వివరించారు. వాహనదారులు వీటిని గమనించి, తమ ప్రయాణాన్ని సాఫీగా కొనసాగించాలని సూచించారు.