నరసన్నపేట మండలం అంపలాం ప్రాథమిక పాఠశాలను బుధవారం సందర్శించిన ఎంఈఓ ఉప్పాడ శాంతారావు, విద్యార్థుల హోంవర్క్ లను, వర్క్ బుక్ లను పరిశీలించారు. విద్యార్థులకు సూచనలు అందిస్తూ, ప్రతిరోజు డిక్టేషన్ ఇవ్వాలని హెచ్ఎంకు సూచించారు. పాఠశాల మౌలిక వసతులపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.