శనివారం నరసన్నపేట పి ఎం శ్రీ పాఠశాలలో జరిగిన నియోజకవర్గస్థాయి విద్యార్థుల పోటీ కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ డిఇఓ విజయకుమారి పాల్గొన్నారు. విద్యార్థులలో పోటీతత్వం పెంచడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత ఫలితాలు సాధించవచ్చని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఎస్సై రైటింగ్, డిబేటింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు జిల్లా స్థాయికి ఎంపిక అవుతారని ఆమె వివరించారు. ఎంఈఓలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.