నరసన్నపేట: డీఎస్పీగా ఎంపికైన రావులవలస యువకుడు సుందర్

1చూసినవారు
నరసన్నపేట: డీఎస్పీగా ఎంపికైన రావులవలస యువకుడు సుందర్
గ్రూప్ వన్ పరీక్షలలో నరసన్నపేట మండలం రావుల వలస గ్రామానికి చెందిన పైల సుందర్ రావు డీఎస్పీగా ఎంపికయ్యారు. శుక్రవారం రాత్రి విడుదలైన ఫలితాలలో ఆయన ఈ విజయం సాధించారు. ప్రస్తుతం స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్లో ఏఏఓ గా విధులు నిర్వహిస్తున్న సుందర్ రావు, వ్యవసాయ కూలీ అయిన తండ్రి రాజారావు, గృహిణి అయిన తల్లి లక్ష్మిల కుమారుడు. డీఎస్పీగా ఎంపిక కావడంతో గ్రామస్తులు, బంధువులు ఆయనను అభినందించారు.

సంబంధిత పోస్ట్