నరసన్నపేట ఎంపీడీవో ఆదేశాల మేరకు, పరిపాలన అధికారి విజయనంద్ గురువారం స్థానిక బోర్డు ఉన్నత పాఠశాలలో స్వచ్ఛ రథాన్ని విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. విద్యార్థుల నుండి సేకరించిన 60 కేజీల పాత నోటు పుస్తకాలు, పేపర్లకు బదులుగా వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో ద్రాక్షాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.