రాష్ట్ర టిడిపి కార్యదర్శిగా పదవీ ప్రమాణం చేసిన అనంతరం మొదటిసారిగా నరసన్నపేట విచ్చేసిన అర్చనకు టిడిపి శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. గురువారం రాత్రి నరసన్నపేట చేరుకున్న ఆమెకు నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, ఏఎంసి అధ్యక్షురాలు పాగోటి ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. తనకు ఇచ్చిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని అర్చన పేర్కొన్నారు.