మంగళవారం నరసన్నపేట మండలం రావులవలస పంచాయితీలో జిల్లా యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి బమ్మిడి శ్రీరామ్ మూర్తి ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మరికొద్ది రోజుల్లో పాఠశాలలు తెరవనున్న నేపథ్యంలో, తల్లిదండ్రులను తమ పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ బడిలో చేర్పించాలని వారు కోరారు.